Tuesday, April 16, 2024

ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: మరో వోలటైల్ సెషన్‌లో సోమవారం మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రంగాలవారీగా చూసినప్పుడు మిశ్రమ ట్రెండ్‌ను చూయించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.10 పాయింట్లు లేక 0.08 శాతం తగ్గి 62130.57 వద్ద, నిఫ్టీ 0.55 పాయింట్లు పెరిగి 18497.15 వద్ద ముగిసింది. మార్కెట్ బలహీనంగా మొదలై ఒడుదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీలో బిపిసిఎల్, దివీస్ లాబోరేటరీస్, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, యుపిఎల్ లాభపడగా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐషెర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, కొటక్ మహీంద్ర బ్యాంక్ నష్టపోయాయి. రంగాల వారీగా చూసినప్పుడు పిఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగింది. మెటల్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది. ఐటి ఇండెక్స్ 0.4 శాతం తగ్గింది. ఇదిలావుండగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్, దాల్మియా భారత్ వాల్యూమ్స్ బాగా పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News