Thursday, March 28, 2024

సెరెనా, వోజ్నియాకి శుభారంభం

- Advertisement -
- Advertisement -

Auckland Tennis Tournament

 

ఆక్లాండ్: ఈ ఏడాది జరుగుతున్న తొలి టెన్నిస్ టోర్నమెంట్ ఆక్లాండ్ ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్‌లు సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) శుభారంభం చేశారు. ఇతర పోటీల్లో రెండో సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా), నాలుగో సీడ్ జులియా జార్జెస్ (జర్మనీ) జయకేతనం ఎగుర వేశారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ ఇటలీ క్రీడాకారిణి కమిలాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సెరెనా అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సెరెనా 63, 62తో కమిలాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో సెరెనా అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో పోటీలో పెట్రా మార్టిక్ చెమటోడ్చి నెగ్గింది.

అమెరికా క్రీడాకారిణి అర్కొనడాతో జరిగిన పోరులో మార్టిక్ 57, 64, 64తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో మార్టిక్‌కు చుక్కెదురైంది. ప్రత్యర్థి క్రీడాకారిణి అద్భుత ఆటతో సెట్‌ను దక్కించుకుంది. అయితే తర్వాతి రెండు సెట్లలో మార్టిక్ ఆధిపత్యం చెలాయించింది. నిలకడగా ఆడుతూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమలో వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ జులియా జార్జెస్ 61, 76తో బెల్జియంకు చెందిన గ్రీట్ మినెన్‌ను ఓడించింది. తొలి సెట్‌లో జులియా కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. అయితే రెండో సెట్‌లో గ్రీట్ అద్భుత పోరాట పటిమను కనబరిచింది. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు.

కానీ, ఇందులో ఆఖరు వరకు దూకుడును ప్రదర్శించిన జులియా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. ఇక, ఐదో సీడ్ వోజ్నియాకి 61, 60తో న్యూజిలాండ్ క్రీడాకారిణి పెగే హొరిగన్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే వోజ్నియాకి చెలరేగి ఆడింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం ఒక్క గేమ్‌ను మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో పోటీలో మూడో సీడ్ అమందా అనిసిమోవా విజయం సాధించింది. తొలి రౌండ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి కటెరినా కొజ్లొవాను ఓడించింది. ఏకపక్షంగా సాగిన పోరులో అమందా 63, 64తో జయకేతనం ఎగుర వేసింది.

Serena and Wozniacki won in Auckland Tennis Tournament
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News