Saturday, April 27, 2024

హద్దులు, ఎల్లలు లేని ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

janu

 

సెన్సేషనల్ తమిళ్ హిట్ చిత్రం ‘96’. ఈ సినిమా వల్లనే త్రిష కథానాయికగా కమ్‌బ్యాక్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 పురస్కారాలను తనకు అందించింది ఈ చిత్రం. ఈ చిత్రంలో నటించిన విజయ్ సేతుపతికి కూడా అంతే పేరొచ్చింది. దర్శకుడిగా సి.ప్రేమ్ కుమార్ పేరు మార్మోగింది. బాక్సాఫీస్ సక్సెస్‌తో పాటు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఈ క్రమంలోనే ‘96’ రీమేక్ హక్కులు చేజిక్కించుకున్న నిర్మాత దిల్ రాజు… సమంత-, శర్వానంద్ జంటగా తెలుగులో ఈ రీమేక్‌ని ప్రారంభించారు. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో ‘జాను’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. షూటింగ్ దాదాపు పూర్తయింది.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఒక ఎడారిలో ఒకదాని వెంట ఒకటిగా ఒంటెలు నడుచుకుంటూ వస్తుండగా… ఆ ఒంటెలను తాడుతో లాగుతున్న ప్రయాణీకుడిగా శర్వా కనిపిస్తున్నాడు. ఎటువంటి సరిహద్దులు .. షరతులు లేని అసలు సిసలైన నివాళి! అంటూ చిత్ర బృందం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆసక్తికరం. అంటే హద్దులు, ఎల్లలు లేని అద్భుతమైన ప్రేమకథ అనే అర్థం మనకు స్ఫురిస్తోంది.

A love story without boundaries
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News