- Advertisement -
కల్లోలిత బలూచిస్థాన్ లోని దక్షిణ ప్రావిన్స్‌లో మంగళవారం మందుపాతర పేలి ఏడుగురు సైనికులు మృతి చెందారు. సైనికుల వాహనాన్ని టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడికి బాధ్యులెవరో ఇంకా బయటపడలేదు. పాకిష్థాన్ నుంచి బలూచిస్థాన్‌ను వేర్పాటు చేసి స్వాతంత్రం కల్పించాలని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఎ) పోరాటం చేస్తోంది. గత మార్చిలో బిఎల్‌ఏ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన దగ్గర నుంచి తెరపైకి వచ్చింది. ఈ సంఘటనలో 100 మంది భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
- Advertisement -