Thursday, May 2, 2024

నేపాల్‌లో తీవ్ర భూకంపం

- Advertisement -
- Advertisement -

అరగంట వ్యవధిలో రెండు సార్లు కంపించిన భూమి
రిక్టర్ స్కేలుపై 5.3, 6.3 తీవ్రతగా నమోదు
ఆ తర్వాత వరస ప్రకంపనలు
ఢిల్లీసహా ఉత్తరాదిలోనూ ప్రకంపనలు
భయంతో ఇళ్లలోంచి బైటికి పరుగులు తీసిన ప్రజలు

ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్‌లో మంగళవారంగంట వ్యవధిలో నాలుగు సార్లు తీవ్రస్థాయిలో భూమి కంపించింది. దీని ప్రభావం ఢిల్లీ సహా ఉత్తర భారతంలో కూడా కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీఎన్‌సిఆర్ పరిసర ప్రాంతాల్లో కొద్ది సేపు భూమి బలంగా కంపించింది. ప్రకంపనలు రావడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఇళ్లు, కార్యాలయాలనుంచి బయటికి పరుగులు తీశారు.

ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, హాపూర్, అమ్రోహా, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నేపాల్‌లో మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో తొలిసారి భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. దాని తీవ్ర 5.3గా ఉన్నట్లు, భూమిలోపలపది కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సిఎస్ గుర్తించింది. ఇది గుర్తించిన అరగంట లోపే 3.06 గంటలకు 6.3 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సిఎస్ గుర్తించింది.దీని కేంద్రం బఝంగ్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించింది. ఆ తర్వాత 3.13 గంటలు, 3.45గంటలు, 4.28 గంటలకు మరో మూడు సార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ఒక విద్యార్థి సహా ఇద్దరు గాయపడగా, పలు ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విద్యార్థి భయంతో రెండతస్తుల భవనంపైనుంచి దూకడంతో గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బఝంగ్‌లో జిల్లా పోలీసు కార్యాలయ భవనంతో పాటుగా పలు భవనాలకు పగుఉ్ల వచ్చాయి.

ఖాట్మండుతో పాటుగా అచమ్, దోతి, బజుర, బైతడి జిల్లాల్లో భూకంప ప్రభావం కనిపించింది. నేపాల్‌లో రెండోసారి భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనటు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల్లో లైట్లు, ఫ్యాన్లు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో బైటికి పరుగులు తీశారు.ఈ ప్రకంపనలపై ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజలెవరూ భయపడవద్దని , సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News