Monday, June 5, 2023

జూన్ 5 నుండి రెండో విడత గొర్రెల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. జూన్ 5 వ తేదీ నుండి 2 వ విడత గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పశుసంవర్ధక శాఖ ఉన్నాతాధికారులతో 2 వ విడత గొర్రెల పంపిణీ పై ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి 10 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్బంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జూన్ 2 వ తేదీ నుండి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల నేపధ్యంలో జూన్ 5 వ తేదీన నల్లగొండ జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీని శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.

అదేరోజున అన్ని జిల్లాలలోని నియోజకవర్గాలలో ఆయా జిల్లా మంత్రులు, ఎంపిలు , ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గొర్రెల యూనిట్ల పంపిణీ ని ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లా కలెక్టర్ లు, పశుసంవర్ధక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలతో లేఖలు పంపాలని పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ ను మంత్రి ఆదేశించారు. ఈ లోగా లబ్దిదారులను తీసుకెళ్ళి గొర్రెల కొనుగోలు నిర్వహించేలా చర్యలు తీసుకొనే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి విడతలో 3.93 లక్షల మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందని, 2 వ విడతలో 3.50 లక్షల మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

అదేవిధంగా వచ్చే నెల 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా 8,9,10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఒక్కో ప్రాంతంలో 20 నుండి 30 వరకు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో మత్స్య శాఖ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా మత్స్యకారులు తయారు చేసిన చేపల ప్రై, బిర్యానీ, చేపల పులుసు వంటి వివిధ రకాల చేపల వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. మృగశిర కార్తె రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కి అవసరమైన చేప పిల్లలను కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఫిష్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుతోపాటు పశుసంవర్ధకశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News