1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’ అండ్ ‘ఆఫ్టర్ శివ’ పునర్నిర్వచించిన శివ గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ’శివ’ మళ్లీ బిగ్ స్క్రీన్ అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈసారి అద్భుతమైన 4కె విజువల్స్ తో పాటు, ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్ సినిమాకు లేని విధంగా, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. మోనో మిక్స్‌లో ఉన్న శివ సౌండ్‌ను అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రీ-మాస్టర్ చేసి, అడ్వాన్స్ డాల్బీ ఆట్మాస్‌లోకి మార్చారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ‘శివ’ 4కె డాల్బీఆట్మాస్ రీ-రిలీజ్ డేట్‌ని ప్రకటించారు కింగ్ నాగార్జున-. ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుందని తెలియజేశారు.
నవంబర్ 14న ‘శివ’ రీ-రిలీజ్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -