Monday, May 19, 2025

మహేశ్‌బాబు భార్య సోదరికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

చైనాలో పుట్టిన కరోనా వైరస్(Covid Positive) ప్రపంచదేశాలని గడగడలాడించింది. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు ప్రభుత్వాలు పకడ్బందీగా లాక్‌డౌన్‌లు విధించడం.. ఆ తర్వాత శాస్త్రవేత్తలు కరోనాక వ్యాక్సిన్ కనిపెట్టడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. దీంతో చాలా మంది వైరస్ అంతమైపోయిందని భావిస్తున్నారు. కానీ, చాపకింద నీరులా వైరస్ ప్రభావం అక్కడక్కడా కనిపిస్తుంది. తాజాగా మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని శిల్పా శిరోద్కర్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆమె అభిమానులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె త్వరగా కోరుకోవాలని కొందరు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ‘ఏంటీ కరోనా మళ్లీ మొదలైందా’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్, తదితర దేశాల్లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక శిల్పా శిరోద్కర్ ‘బ్రహ్మ’ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ, ఆమె ఊహించినంత సక్సెస్ రాలేదు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఆమె.. హిందీ బిగ్‌బాస్ 18 కంటెస్టెంట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News