Tuesday, August 5, 2025

దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు రావాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆకాంక్షించారు. ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి కెటిఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హాజరైంది. ఈ సమావేశంలో కెటిఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చు విషయంలో, దొంగ హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయంలో, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్న పార్టీలు, నేతల విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు.

చాలా విషయాలను తమ పార్టీ నుంచి రాతపూర్వకంగా సమర్పించామని కెటిఆర్ చెప్పారు. తాము గత 20 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ఎన్నికల కమిషన్‌తో విస్తృతంగా చర్చించామన్నారు. ఎప్పటికప్పుడు తమకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కమిషన్ కోరిందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్‌జిఒలు, ప్రజాసంఘాలతో చర్చించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని, దక్షిణాదిలో హైదరాబాదులో అందరినీ పిలిచి మాట్లాడి అభిప్రాయాలు తీసుకోని సంస్కరణలు తీసుకురావాలని తమ పార్టీ తరఫున వివరంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News