Thursday, May 2, 2024

సంగ్రూర్‌లో సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ ’ఆప్‌‘ని ఓడించారు!

- Advertisement -
- Advertisement -

 

Mann

న్యూఢిల్లీ:  శిరోమణి అకాలీ దళ్(అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ ఆదివారం తన సమీప ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్‌ను 5822 ఓట్ల తేడాతో ఓడించారు. మాన్‌కు 253154 ఓట్లు రాగా, గుర్మెయిల్ సింగ్‌కు 247332 ఓట్లు వచ్చాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ తమ ఓటమిని అంగీకరించి, మాన్‌కు అభినందనలు తెలిపింది. ఆప్ ఇదో తీరని దెబ్బ అనే చెప్పాలి.
సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ శిరోమణి అకాలీ దళ్(అమృత్‌సర్) అధ్యక్షుడు. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. తరన్‌తర్న్ (1989), సంగ్రూర్(1999), సంగ్రూర్(2022)నుంచి ఆయన గెలుపొందారు. మాన్ ఇదివరలో 30 సార్లు అరెస్టయ్యారు. ఆయన మీద దేశద్రోహం(సెడిషన్) అభియోగం కూడా ఉంది. కానీ అతడు ఏనాడు దోషిగా తేలలేదు. ఆయన 1945లో సిమ్లాలో జన్మించారు. ఆయన తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ జోగిందర్ సింగ్ మాన్, ఆయన పంజాబ్ విధాన్ సభకు 1967లో స్పీకర్‌గా కూడా పనిచేశారు. సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ 1967లో పోలీస్ సర్వీస్‌లో చేరారు. బ్లూస్టార్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఆయన 1984 జూన్ 18న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News