Saturday, April 20, 2024

సౌర విద్యుత్ రంగంలోకి సింగరేణి

- Advertisement -
- Advertisement -

Solar Power Sector

 

హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా చేపట్టి లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థ తన చరిత్రలో మరో ఆరుదైన మైలురాయిని చేరుకుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ తన సత్తా చాటాలని, ఆ రంగంలోకి అడుగిడింది. సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 220 మెగావాట్ల సామర్థమున్న సోలార్ పవర్ ప్లాంటులో మొదటి ప్లాంటు(5 మెగావాట్లు) విద్యుత్‌ను 33 కె.వి. పవర్‌లైన్‌కు అనుసంధానం చేసి సోలార్ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి ప్రవేశించింది.

దీంతో దేశంలోనే థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పాదక రంగంలోకి ప్రవేశించిన తొలి బొగ్గు కంపెనీగా సింగరేణి సరికొత్త సంప్రదాయాన్ని లిఖించింది. మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మాణం పూర్తైన తొలి దశలోనే 5 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించింది. శుక్రవారం మధ్యాహ్నం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీనిపై సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ కార్మకులందరికీ అధికారులు, సిబ్బంధికి, అభినందనలు తెలిపారు.

Singareni into the Solar Power Sector
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News