Friday, May 3, 2024

పరిమళాల ‘పట్టు’

- Advertisement -
- Advertisement -

27రకాల సుగంధ ద్రవ్యాలతో సిరిచందన పట్టుచీర
సిరిసిల్ల నేతన్న నల్ల విజయ్ అద్భుత సృష్టి
ఆవిష్కరించిన మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి మరోసారి ప్రతిభ చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్. ఇప్పటివరకు అగ్గిపెట్టేలో పట్టే చీర నుంచి మొదలుకుని దబ్బనంలో దూరే చీరలు తయారు చేసిన ఆయన, ఈ సారి 27 రకాల సు గంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై వేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు ఆవిష్కరించారు. విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా మంత్రులు నామకరణం చేశారు. ఈ సందర్భంగా యువ చేనేత కళాకారుడు విజయ్‌ను మంత్రులిద్దరూ అభినందించారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టులేని లాల్చీ, పైజా మా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News