- Advertisement -
ప్రాణాపాయంలో ఉన్న తమ్ముడిని అక్క రక్షించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నతన తమ్ముడికి అక్క మూల కణాలను దానం చేసింది. వివరాలలోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 5 సంవత్సరాల బాలుడు అప్లాస్టిక్ అనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడిని పరిశీలించిన వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే మూల కణాలు మార్చాలన్నారు. ఇంటర్ చదువుతున్న బాలుడి సోదరి తన శరీరంలోని మూలకణాలను దానం చేసి తమ్ముడి ప్రాణాలు కాపాడింది.రాఖీ పండుగా సందర్భంగా సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్ముడికి రాఖీ కట్టింది. నీకు నేనున్నాంటూ తమ్ముడికి అక్క దైర్యం చెప్పింది.
- Advertisement -