Wednesday, May 15, 2024

56 శాతం మంది శ్రామికులు, యువతనే !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సుమారు సగం కంటే ఎక్కువ శాతం మంది వందేభారత్‌లో ప్రయాణిస్తున్నది శ్రామికులు, యువతనేనట. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే స్వయంగా ప్రకటించింది. “ వందే భారత్ రైలులో 56 శాతం మంది శ్రామికులు, యువతనే ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు” అని దక్షణ మధ్య రైల్వే వెల్లడిస్తోంది. తద్వారా దేశంలోని రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆధునీకరణ, సాంకేతిక పురోగతికి ఒక దీపస్తంభంగా నిలుస్తుంది. ఈ రైలు ఆధునిక డిజైన్, అగ్రశ్రేణి సౌకర్యాలు సమర్థవంతమైన సేవతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో రైలు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది . అత్యుత్తమ ఇన్-క్లాస్ సౌకర్యాలతో నిండిన సౌకర్యవంతమైన రైలు ప్రయాణ అనుభవానికి ప్రసిద్ధి చెందిన వందే భారత్ రైళ్లు ఇలా యువత శ్రామిక వర్గంలో ఇష్టపడే రవాణా మార్గంగా మారింది . ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు సికింద్రాబాద్ – విశాఖపట్నంతో సహా దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలో ప్రారంభమవుతున్నాయి.

సికింద్రాబాద్ – తిరుపతి, తిరుపతి – సికింద్రాబాద్, కాచిగూడ – యశ్వంతపూర్ (హైదరాబాద్ – బెంగళూరు), విజయవాడ – చెన్నై సెంట్రల్ పరిధిలో ఈ రైళ్లు సమర్ధవంతంగా నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో బయలుదేరిన వందేభారత్ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల ఇటీవలి డేటా ప్రకారం.. సగటున 29.08 శాతం మంది ప్రయాణికులు 25 నుండి -34 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులేనని తేల్చింది. అదేవిధంగా 35 నుండి -49 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు సగటున 26.85 శాతం ఇతర రవాణా మార్గాల కంటే కూడా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారని తేలిందని వెల్లడించింది. దీని ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లలో మొత్తం 56 శాతం మంది ప్రయాణికులు యువకులు, శ్రామిక వర్గాలకు చెందినవారేనని గుర్తించింది. కాగా ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ సౌకర్యవంతమైన రైలు ప్రయాణ అనుభవంతో పాటు వేగం,

తగ్గిన ప్రయాణ సమయం కారణంగా వందేభారత్ రైళ్లు యువకులు, శ్రామిక వర్గాలకు ఇష్టమైన రవాణా మార్గంగా మారాయని చెప్పారు. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి, రైలు ప్రయాణాన్ని మరింత చిరస్మరణీయంగా, సౌకర్యవంతంగా చేయడానికి భారతీయ రైల్వేల నిబద్ధతకు వందే భారత్ రైళ్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైళ్ల సేవలను మరింత మంది రైలు వినియోగదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News