Thursday, September 25, 2025

మంచుకొండల్లో హింసాగ్ని

- Advertisement -
- Advertisement -

లెహ్ : కేంద్ర ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాల ని, లద్దాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో బుధవారం భా రీ ఎత్తున చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారా యి. ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన భద్రతాబలగాలకు, ఆందోళన కారులకు మధ్య తలెత్తిన సంఘర్షణలు చివరకు కాల్పులకు దారి తీయడంతో నలుగురు ప్రాణాలు కోల్పో గా, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2019 ఆగస్టు 5 న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని, జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రహోదా పునరుద్ధరణ కోసం ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రహోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు బుధవారం

లేహ్ నగర వీధుల్లోకి వచ్చారు. నిరసనలు హింసాత్మకంగా మారి రాళ్లు రువ్వడం, బీజేపీ కార్యాలయానికి, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. ఇంకా అల్లర్లు ఆగకపోవడంతో భద్రతా దళాలు కాల్పులు చేయవలసి వచ్చింది. అక్కడ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతుగా సెప్టెంబర్ 10 నుంచి నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. లద్దాఖ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి) యువజన విభాగం 35 రోజుల నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ విభాగం 15 మంది సెప్టెంబర్ 10 నుంచి నిరాహార దీక్ష సాగిస్తున్నారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సెప్టెంబర్ 23 న ఆస్పత్రికి తరలించారు. ఈనేపథ్యంలో లద్దాఖ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి) యువజన విభాగం తాజా నిరసనలకు పిలుపునిచ్చింది.

వాంగ్‌చుక్ విచారం.. దీక్ష విరమణ
రాష్ట్రహోదా కోసం పర్యావర ణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా గత రెం డు వారాలుగా నిరాహార దీ క్షచేస్తున్నారు. ఆందోళన లు హింసాత్మకంగా మారడంతో తన 15 రోజుల దీ క్ష విరమించారు. శాంతియుతంగా చేపట్టిన నిరసనలు ఎ లాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతోనే యువత నిస్పృహ చెందారన్నారు. ఇది జెన్‌జెడ్ విప్లవంగా అభివర్ణించారు. లద్దాఖ్ లోనూ, దేశంలోనూ అస్థిరత, అశాంతి తాము కో రుకోవడంలేదని తమ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని ఎక్స్‌ఖాతాలో పంపించారు

నిషేధాజ్ఞలు
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతల దృష్టా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడే సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ముందుగా అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అందుకే కేంద్రం జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వలేదు : ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్ : కేంద్రంలోని అధికార బీజేపీపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడు తూ జమ్ముకశ్మీర్‌లో బీజేపీ అధికారం కోల్పోయిందని, అం దుకే రాష్ట్ర హోదా ఇవ్వలేదని ఆరోపించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటేనే రాష్ట్రహోదా ఇస్తామనుకోవడం కరెక్ట్‌కాదు.ఇది ప్రజలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్క డి ప్రజలు మూడేళ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. వారి డిమాండ్లపై కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినా ఆశించిన ఫలితం రాలేదు. ఈ నేపథ్యం లోనే అక్టోబర్ 6న చర్చలకు రావాలని పిలుపు వచ్చింది.

Also Read: బిసి రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News