ఆసియాకప్-2025లో భాగంగా జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లను చేజార్చుకున్నారు. పాక్ ఆటగాటు సాహిబ్‌జాదా ఫర్హాన్(58) పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరగాల్సింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫర్హాన్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద అభిషేక్ వదిలేశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆయూబ్ క్యాచ్‌ని కుల్దీప్ జారవిడిచాడు. ఎనిమిదవ ఓవర్‌లో మరోసారి ఫర్హాన్ క్యాచ్‌ని అభిషేక్ చేజార్చుకున్నాడు. ఇది కాస్త క్లిష్టమైన క్యాచే. 19వ ఓవర్‌లో ఫహీమ్ అష్రాఫ్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మాన్ గిల్ ఒడిసి పట్టుకోలేకపోయాడు. (Sunil Gavaskar)
అయితే భారత ఆటగాళ్ల మీద ఉన్న ఒత్తిడి కారణంగానే వాళ్లు ఈ క్యాచ్‌లను జార విడిచారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు. ‘‘గ్రూప్ స్టేజీలో టీం ఇండియా, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన ఒత్తిడి భారత ఆటగాళ్ల మీద ఉంది. అదే మనకు మైదానంలో కనిపించింది. అందుకే కొన్ని తేలికైన క్యాచ్‌లను చేజార్చుకున్నారు. కొన్ని కష్టతరమైన క్యాచ్‌లు కూడా మిస్ అయ్యాయి. కానీ, టీం ఇండియా ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు’’ అని గవాస్కర్ విశ్లేషించారు.
Also Read : బిసిసిఐ అధ్యక్ష రేసులో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్!