Thursday, May 2, 2024

మంత్రి పదవి దక్కనందుకు కాంగ్రెస్ కార్యకర్తల విధ్వంసం

- Advertisement -
- Advertisement -

పుణె(మహారాష్ట్ర): కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగ్రామ్ తోప్టేకు మహారాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించనందుకు నిరసనగా ఆయన మద్దతుదారులు మంగళవారం సాయంత్రం పుణెలోని శివాజీనగర్ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. తమ నాయకుడికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వనందుకు ఆగ్రహోదగ్రులైన తోప్టే మద్దతుదారులు పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి కర్రలు, ఇనుప రాడ్లతో ఫరీచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లలు, గ్లాస్ ఫర్నీచర్, కంప్యూటర్లు, టీవీని పగులగొట్టి విధ్వంసం సృష్టించారు.

పుణె అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తోప్టేకు సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విస్తరించిన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరసనలు తెలిపారు. సోలాపూర్‌కు చెందిన యువజన కాంగ్రెస్ కార్యదర్శితోసహా పెద్దసంఖ్యలో యువ నేతలు, విద్యార్థి నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.

Supporters of Cong MLA smash party office in Pune

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News