Tuesday, April 30, 2024

నటితో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన హర్దిక్ పాండ్యా

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్, యంగ్ క్రికెటర్ హర్దిక్ పాండ్యా తన ప్రేమ వ్యవహారంపై అభిమానులకు స్పష్టతనిచ్చాడు. బాలీవుడ్ నటి నటషా స్టాన్ కోవిక్ తో తనకున్న సంబంధం గురించి ఇస్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా నటషాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘స్టార్టింగ్ ద ఇయర్ విత్ మై ఫర్ వర్క్’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో హార్దిక్ పాండ్యా, నటషా త్వరలోనే ఒకటికాబోతున్నారని తెలుస్తోంది.

కాగా, హార్దిక్ పాండ్యా, నటషా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని ఇటీవల సోషల్ మీడియాలో పలు రూమార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా లండన్ లో చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. హార్దిక్ తన ఫామ్ ని తిరిగి అందుకోవడం కోసం.. వచ్చే నెల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఎ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. దీంతో శ్రీలంక జట్టుతో టి20 సిరీస్, ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ కు హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోలేదు.

Hardik Pandya makes his relationship with Natasa 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News