న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రస్తుత కొలీజియం వ్యవస్థ తీరుతెన్నుల పట్ల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సిబి ఎ) తీవ్ర అసంతృప్తి , ఆందోళన వ్యక్తం చేసింది. కొలీజి యం ద్వారా ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులకు జరుగుతున్న న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల ప్ర క్రియ బాగా లేదని న్యాయవాదుల అత్యున్నత సంఘం ఆక్షేపించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించేందుకు ఏర్పాటు అయ్యే కొలిజీయం పనితీరు ఇప్పుడు పక్కదోవ పట్టినట్లు అయిందని, పలు సవాళ్లకు దారితీస్తోందని ఎస్‌సిబిఎ అధ్యక్షులు , సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ , న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు రాసిన లేఖలో తెలిపారు. ప్రతిభ ప్రాతిపదికన జడ్జిల ఎంపిక జరగాల్సి ఉంది. అదే విధంగా అన్ని స్థాయిలో మ హిళలకు , ఇతర వర్గాలకు పారదర్శకత, సమానత ప్రాతిపదికన స్థానం కల్పించాల్సి ఉంది.
ఇప్పుడు పలు హైకోర్టుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనే విషయాన్ని తాను ఈ లేఖలో తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుత విధానం సమగ్ర మార్పులలో తీవ్రజాప్యంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. జుడిషియల్ సమగ్రతకు , వ్యవస్థపై ప్రజా విశ్వాసానికి గం డిపడుతోందని తెలిపారు. ఇప్పుడున్న ఎంపిక సిఫార్సులు, తరువాతి ని యామకాలలో అనేక నిర్మాణాత్మక కొట్టొచ్చే లోపాలు ఉన్నాయి. ఇవి న్యా యవ్యవస్థ వైఫల్యాలకు దారితీసే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్య క్తం చేశారు. ఇక పలు హైకోర్టులలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్క డం లేదు. వారు అత్యున్నత స్థానాలలో ఉండటం లేదు. ఇవన్నీ కూడా తా ము అధికారిక లెక్కల ప్రకారం తెలియచేస్తున్నామని, 2024 ఫిబ్రవరి గణాంకాల మేరకు చూస్తే హైకోర్టులలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఉండాల్సిన కోటాతో పోలిస్తే 9.5 శాతం ఉంది. ఇక సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో ఇది నామమాత్రంగా 2.94 శాతం నమోదు అయి ఉందని, ఈ తేడా ఎప్పటికి తీరుతుంది? న్యాయవ్యవస్థలోనే న్యాయం ఎప్పుడు జరుగుతుందని వికాస్ సింగ్ ఘాటుగా ప్రశ్నించారు.