Friday, May 3, 2024

స్పీకర్లూ పార్టీ పక్షులే కదా?

- Advertisement -
- Advertisement -

Supreme Court

 

న్యూఢిల్లీ : చట్టసభల సభ్యుల అనర్హతపై స్పీకర్ లేదా సభాధ్యక్షుల అధికారంపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. అంశంపై పార్లమెంటు పునరాలోచనకు దిగాలని సూచించింది. చట్టసభలు సభాధ్యక్షుని అధికారాల వివాదాస్పద అంశంపై అత్యున్నత న్యాయస్థానం దిశానిర్ధేశక రూలింగ్ వెలువరించింది. సభ స్పీకర్ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకే చెంది ఉంటారని, ఈ దశలో స్పీకర్ అనర్హత నిర్ణయం తీసుకోవచ్చా? ఇది ఈ విధంగానే కొనసాగాలా? అని పార్లమెంట్‌ను ప్రశ్నించింది.

అసాధారణ పరిస్థితులలో సభ్యుల సభ్య త్వ రద్దు వంటి నిర్ణయాలకు స్పీకర్‌ను దూరంగా ఉంచే విషయం గురించి పార్లమెంట్ తీవ్రస్థాయిలోనే ఆలోచించాల్సి ఉందని న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. లోక్‌సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీల స్పీకర్‌లకు ఇప్పుడున్న పరిష్కర్త పాత్రకు ప్రత్యామ్నాయ పద్దతిని వెతకాల్సి ఉంది. ఈ కీలక విషయాల నిర్ణయాధికారం కోసం ఒక శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు మంచిదని, ఈ దిశలో పార్లమెంట్ ఆలోచనకు దిగాలని ధర్మాసనం సూచించింది.

ఈ ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల మాజీ న్యాయమూర్తుల సారథ్యం ఉండాలని, లేదా త్వరితగతి,నిష్పక్షపాత నిర్ణయాలను తీసుకునేందుకు మరో ఏదైనా యంత్రాంగం ఏర్పాటు చేయాలని తెలిపారు. అనర్హత వేటు అంశాలలో స్పీకర్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అపవాదు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యకు దిగడం పార్లమెంట్ బాధ్యత అని పేర్కొన్నారు. చట్టసభ సభ్యుల అనర్హత వేటు అంశాలలో స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు, వీటిలో జరిగే తీవ్రస్థాయి జాప్యాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొంటోందని తెలిపారు.

మణిపూర్ అసెంబ్లీ వ్యవహారంతో సుప్రీం స్పందన
మణిపూర్ అసెంబ్లీలో బిజెపి సభ్యుడిపై అనర్హత అంశం పై పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు కీలక రూలింగ్‌కు దారితీసింది. అక్కడ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్‌పై టిహెచ్ శ్యాంకుమార్ గెలిచారు. అ యితే తరువాత బిజెపిలో చేరి మంత్రి అయ్యారు. ఆయనను సభ్యులుగా అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత కీయిషం మేఘాచంద్రసింగ్ పేర్కొన్నారు. మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోకపోవడంపై ఈ నేత తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయింంచారు.

తగు చర్యకు స్పీకర్‌ను ఆదేశించాలనే ఆయన అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు, స్పీకర్ నిర్ణయాధికారంలో తాము కలుగచేసుకోలేమని, సంబంధిత అంశం ఒకటి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపింది. దీనితో ఈ నేత సుప్రీంకోర్టుకు వెళ్లారు. మణిపూర్ స్పీకర్ ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అట్టిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాలలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో అసలు స్పీకర్ల ఈ అతీత అధికారా న్ని కొనసాగించ వచ్చా? లేదా అనేది తరచితరచి చూసుకోవల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

నాలుగు వారాల తరువాత కూడా మణిపూర్ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోకపోతే , ఈ అంశంపై ఏ పక్షం అయినా కోర్టు తదుపరి చర్యలకు ఆశ్రయించవచ్చునని స్పష్టం చేశారు. ఈ మేర కు వారికి తగు విధమైన ఆదేశాలకు, ఈ విషయంలో తగు ఉపశమనానికి వీలుటుందని వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి స్పీకర్ హోదాలో ఉంటూ అనర్హత వేటు, వేటుపై జాప్యం గురించి తన నిర్ణయాధికార పాత్రను లేదా పాక్షిక న్యాయమూర్తి పాత్రను ఇదే విధంగా కొనసాగించుకోవచ్చా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటువంటి వాటిపై సరైన న్యాయం దక్కాలంటే స్వతంత్ర ప్రతిపత్తి గల మరేమైన విధానం లేదా వ్యవస్థ ఉంటే బాగుంటందని ధర్మాసనం అభిప్రాయపడింది.

 

Supreme Court doubts speaker’s authority
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News