Sunday, April 28, 2024

సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ

- Advertisement -
- Advertisement -

కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం జ్రారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన 237 పిటిషన్లపై 3 వారాలలో(ఏప్రిల్ 8వ తేదీ లోగా) సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజు లోపల ప్రభు త్వం ఎవరికైనా పౌరసత్వం ఇచ్చిన పక్షంలో పిటిషనర్లు తమ వద్దకు మళ్లీ రావచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ ఒక్కరి పౌరసత్వాన్ని ప్రభుత్వం తొలగించబోదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సిఎఎ నిబంధనల అ మలుపై స్టే కోరుతూ దాఖలైన దాదాపు 237 పిటిషన్లకు సవివరంగా కౌంటర్ దాఖలు చేయడానికి తమకు 4 వారాల సమయం కావాలని ఆయన కేంద్ర ప్రబుత్వం తరఫున కోర్టును కోరారు. పౌరసత్వ సవరణ చట్టం, 2019 రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది తీ ర్పు వెలువడేవరకు దీని నిబంధనల అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ డివై చంద్రూడ్ సారథ్యంలోని ముగ్గురు స భ్యుల ధర్మాసనం మంగళవారం విచారణకు చేపట్టింది. సిజెఐతోపాటు జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టి స్ మనోజ్ మిశ్రా ఉన్నారు. ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వడానికి తమకు కొంత వ్యవధి కావాల ని మెహతా కోరగా మూడు వారాల వ్యవధి ఇచ్చి న సిజెఐ ఏప్రిల్ 9వ తేదీన దీనిపై తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత వివాదాస్పద సిఎఎ నిబంధనలను అమలు చేస్తూ మార్చి 15న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ 200కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. కాగా..గత వారం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో కేరళకు చెందిన ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్(ఐయుఎంఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ లోక్‌సభ ఎన్నికలు వస్తున్న వేళ్ల వివాదాస్పద సిఎఎ నిబంధనలు అమలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మత ప్రాతిపదికన ముస్లింల పట్ల సిఎఎ వివక్ష చూపుతోందని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇది రా జ్యాంగంలోని 14వ అధికరణ అయిన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని వారు తెలిపారు. ఐయుఎంఎల్‌తోపాటు టిఎంసి నాయకురాలు మహువా మొయిత్ర, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అస్సాం కాంగ్రెస్ నాయకుడు దేబబ్రత సైకియా, ఎన్‌జిఓలు రిహాల్‌మంచ్, సిటిజన్స్ అగెనెస్ట్ హేట్, అస్సాం న్యాయవాదుల సంఘం,కొందరు న్యాయ విద్యార్థులు తదితరులు సిఎఎను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News