Friday, May 3, 2024

గురునానక్, శ్రీనిధి యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలి

- Advertisement -
- Advertisement -
విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్ : ప్రైవేట్ యూనివర్శీటీలుగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేయకుండా, అనుమతులు ఇవ్వకుండా విద్యార్ధులను చేర్పించుకుని వారి చదువులను నష్టం చేస్తున్న యూనివర్శీటీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. శనివారం ఆసంఘం నాయకులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొపెసర్ ఆర్.లింబాద్రికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ గురునానక్, శ్రీనిధి కళాశాలలో యూనివర్శీటీ రాకముందే అడ్మిషన్లు చేసి, బోర్డులు, ప్రచారం చేసి వేలాది మంది విద్యార్ధులను చేర్చుకున్నారని విమర్శించారు.

ప్రభుత్వం విద్యార్థులు తమ చదువులు నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా జెఎన్టీయుహెచ్ అనుబంధంగా ఉన్న వాటిలో చేర్పించాలని కోరారు. విద్యార్థులు చెల్లించిన ఫీజులు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.శంకర్, ఆర్.సంతోష్, సహాయ కార్యదర్శి కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ ,నాయకులు లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News