Thursday, May 2, 2024

ప్రముఖ జానపద గాయకుడిని హత్య చేసిన తాలిబన్లు

- Advertisement -
- Advertisement -

Taliban kills Afghan folk singer Fawad

 

కాబూల్ : ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని తాలిబన్లు హత్య చేశారు. అతని పేరుపై ఉన్న అందరాబీ పర్వత ప్రాంతంలోనే శుక్రవారం ఫవాద్‌ను హత్య చేసినట్టు గాయకుడి కుటుంబీకులు వెల్లడించారు. తిరుగుబాటుదారులే ఈ హత్య చేసి ఉంటారని తాలిబన్లు పేర్కొనడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే కొందరు తాలిబన్లు తమ ఇంటికి వచ్చి నాన్నతో కలిసి టీ తాగారని, కానీ ఇంతలోనే తమ తండ్రిని పొట్టన పెట్టుకున్నారని ఫవాద్ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యపై న్యాయం కోరుతూ స్థానిక తాలిబన్ కౌన్సిల్‌ను ఆశ్రయించగా, కారణమైన వారిని గుర్తించి శిక్షిస్తామని వారు పేర్కొన్నట్టు ఫవాద్ కుమారుడు జవాద్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించి కారకు లైన తిరుగుబాటు దారులను శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News