Friday, September 19, 2025

ఐటం సాంగ్‌లో తమన్నా.. మామూలుగా రెచ్చిపోలేదు..

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah) ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారు మతిపోగొడుతుంది. తాజాగా మరో ఐటం సాంగ్‌లో కనిపించి.. తన గ్లామర్‌తో సందడి చేసింది తమన్నా. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్ ‘ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్’. ఈ గురువారం నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. బాలీవుడ్‌ తీరుతెన్నులపై ఈ సిరీస్‌ని రూపొందించారు.

ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటీనటులతో పాటు రాజమౌళి అతిథి పాత్ర చేశారు. అయితే ఈ సిరీస్‌‌లో తమన్నా (Tamannaah) ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ‘గఫూర్’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్‌లో తమన్నా.. గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ ఎక్స్‌ప్రెషన్స్.. డ్యాన్స్ మూవ్స్‌తో చెలరేగిపోయింది. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది. ఈ పాటలో ఒకప్పటి బాలీవుడ్ విలన్స్ శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజీత్ కనిపించడం విశేషం. పాటను మీరూ ఓ లుక్కేయండి..

Also Read : నటుడు రోబో శంకర్ ఇకలేరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News