Sunday, April 28, 2024

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డిఎంకె నేత సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతోపాటు చెన్నై లోని నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు చేపట్టారు. చెన్నైలోని ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తరువాత అదుపులోకి తీసుకుంటున్నట్టు బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు ఈడీ ప్రకటించింది. ఈ సమయంలోనే వైద్య పరీక్షల కోసం సెంథిల్‌ను చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అయితే అప్పటికే అనారోగ్యంతో ఉన్న మంత్రి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో ఛాతీ నొప్పి తట్టుకోలేక ఏడ్చేశారు. కారు నుంచి కిందకు దిగుతుండగా మంత్రి తీవ్రంగా విలపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని డిఎంకె రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇలంగో చెప్పారు. ప్రస్తుతం సెంథిల్‌ను ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఇంట్లో లభించిన పత్రాలను ఈడీ అధికారులు సీజ్ చేసి మూడు కార్లలో తమ వెంట తీసుకెళ్లారు.

మంత్రికి బైపాస్ సర్జరీ చేయాలన్న వైద్యవర్గాలు
ఛాతి నొప్పిని తట్టుకోలేక మంత్రి ఏడ్చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయనకు సాధ్యమైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు వెల్లడించారు. మంత్రికి వైద్యులు కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్‌తో బాధపడుతున్న ఆయనను బైపాస్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు.
ఈమేరకు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి బులిటెన్ జారీ చేసింది. ఈసీజే పరీక్షల్లో మాత్రం అసాధారణ ఫలితాలు వస్తున్నా.. రక్తపరీక్షలో మాత్రం గుండెపోటు ఆనవాళ్లు లేవని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఉదయం 10 గంటలకు యాంజియోగ్రామ్ పరీక్షలకు తీసుకెళ్లారు. ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ఉన్నట్టు గుర్తించారు.
హైకోర్టును ఆశ్రయించిన సెంథిల్ భార్య
ఈడీ అరెస్టుపై సెంథిల్ భార్య మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు న్యాయమూర్తులు జె.నిషాబాను, డి.భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
మంత్రి బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ముఖ్యమంత్రి స్టాలిన్ పరామర్శ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆస్పత్రికి వెళ్లి సెంథిల్‌ను పరామర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పా టు పలువురు డిఎంకె నేతలు ఆస్పత్రికి వెళ్లి సెంథిల్‌ను ప రామర్శించారు. బిజెపి బెదిరింపులకు భయపడేది లేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ అ రెస్టు రాజ్యాంగవిరుద్ధమని డిఎంకె ఎంపి ఎలాంగో వి మ ర్శించారు. సెంథిల్‌ను ఈడీ అధికారులు వేధించారని, ఆ యన టార్చర్ చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఆయన చెవి వద్ద ఉబ్బిపోయి ఉందని మరో మంత్రి శేఖర్‌బాబు పేర్కొన్నారు.ఆయన ప్రస్తుతం స్పృహలో లేరని చెప్పారు. గతంలో అన్నాడిఎంకె పార్టీలో ఉన్న సెంథిల్ దివంగత జయలలిత ప్రభుత్వంలో 2011 నుంచి 2015 వరకు రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆ సమయంలోనే రవాణా శాఖలోని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈడీ మరోసారి సెంథిల్‌ను విచారించడానికి రంగంలోకి దిగింది.

ఇది రాజకీయ కక్షసాధింపు : కాంగ్రెస్
సెంథిల్ బాలాజీ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మోడీ సర్కారు రాజకీయ కక్షలకు దిగుతోందని, కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇలాంటి చ ర్యలను విపక్షాలు ఉపేక్షించబోవని ఆగ్రహించారు.
ఇది విపక్షాలపై దాడి : ఆప్
అనారోగ్యంతో బాధపడుతున్న సెంథిల్‌ను అరెస్ట్ చేయడం అమానవీయమని ఆమ్‌ఆద్మీ పార్టీ మండి పడింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని విమర్శించింది.
సెంథిల్ అరెస్టును ఖండించిన దీదీ
సెంథిల్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండి పడ్డారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

సిబిఐకి తమిళనాడులో నో ఎంట్రీ
తమిళనాడు రాష్ట్రంలో కేంద్రదర్యాప్తు సంస్థ సిబిఐ ప్రవేశానికి వీలు లేకుండా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఇకనుంచి రాష్ట్రంలో ఏ కేసునైనా సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే డిఎంకె ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనించ దగిన విషయం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందంటూ దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమబెంగాల్ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు ఉండగా, తాజాగా తమిళనాడు చేరినట్టు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News