అబుదాబి: ఆసియాకప్‌లో గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నామమాత్రంగా జరిగే చివరి మ్యాచ్‌లో భారత్‌తో (Team India) పసికూన ఒమాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీ సాధించాలని భారత్ భావిస్తోంది. ఒమాన్‌కు మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు సూపర్-4కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసి బరిలోకి దిగుతుంది. ఒమాన్ కూడా జట్టులో రెండు మార్పులు చేసింది.
తుది జట్లు :
భారత్ (Team India): అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఒమాన్: అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా(కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామానంది.
Also Read : నేడు ఒమన్‌తో భారత్ ఢీ