Thursday, November 7, 2024

భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఒకరి పేరుపై గల వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకుంది. వివరాలోకి  వెళితే..పోలీసుల కథనం ప్రకారం చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన సలేంద్ర మల్లేశం కు చెందిన భూమి సర్వే నం 104, 105/అ, 105/అ/అ, 105/ఉ/అ, 105/ఊ నందు బాధితునికి సంబందించిన వ్యవసాయ భూమిని తనకు తెలియకుండా అదే గ్రామానికి చెందిన సలేంద్ర లక్ష్మి w/o గంగయ్య, సలేంద్ర వేణు s/o గంగయ్య కు తహశీల్దార్ ధర్పల్లి నరేష్ సహాయం తో ఫిర్యాదు దారుని భూమిని నిందితులు బోయినపల్లి మండలం అనంతపల్లి కి సంబందించిన రిజిష్టర్ డాక్యుమెంట్ ను చండుర్తి మండలములోని ఆనంతపల్లి గ్రామంలోని బాధితుడి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా 25.07.2024న చందుర్తి గ్రామీణ బ్యాంకు లో రుణం కూడా తీసుకున్నారని సలింద్ర మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణలో భాగంగా తహసిల్దార్ నరేష్ చందుర్తి నందు విధులు నిర్వహిస్తున్న సమయం లో చందుర్తి మండలం లోని అనంతపల్లి గ్రామంలో యొక్క పేరు మీద ఉన్న భూమిలో ధరణి పోర్టల్ లో తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి బాధితుని పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని నిందితుల సలేంద్ర వేణు కు పట్టా మార్పిడి చేశాడు. ధరణి పోర్టల్ నుండి బ్యాక్ అండ్ డాటా తీసుకొని చూడగా సదరు ఎమ్మార్వో నరేష్ ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వారికి సహకరించాడని నేరం రుజువు కావడంతో తహసిల్దార్ నరేష్ ను అరెస్టు చేసి వేములవాడ కోర్టులో హాజరపరచడం జరిగిందని సిఐ తెలిపారు. ఒకరి పేరుపై గల వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలియడంతో తహసిల్దార్ నరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. తహసిల్దార్ నరేష్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News