Saturday, November 2, 2024

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్ల దాడి

- Advertisement -
- Advertisement -

గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి సూత్రధారి అయిన యాహ్వా సిన్వర్ హతమైనప్పటికీ హమాస్ తన పోరాటం కొనసాగిస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం సిజేరియా లోని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాస భవనం లక్షంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. హెజ్‌బొల్లా కేంద్రమైన లెబనాన్ వైపు నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫా లోని సిజేరియా లోని నెతన్యాహు నివాస భవనం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక భవనాన్ని డ్రోన్ ఢీకొట్టినట్టు తెలిపాయి. అయితే ఆ సమయంలో నెతన్యాహు కానీ, ఆయన భార్య కానీ ఆ భవనంలో లేరని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి.

లెబనాన్ ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వాయుదళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశౠయి. అయితే మూడోది మాత్రం సిజేరియా లోని ఓభవనాన్ని ఢీకొట్టడంతో పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియా లోని భవనాన్ని ఢీకొనడానికి ముందు లెబనాన్ నుంచి 70 కిమీ దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. నెతన్యాహు ప్రైవేట్ నివాస భవనంపై దాడితోపాటు శనివారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌లో 55 క్షిపణులు లెబనాన్ నుంచి దూసుకొచ్చాయని, ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఆ సమయంలో కారులో కూర్చుంటున్న 50 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని , మరో నలుగురు గాయపడ్డారని పేర్కొంది. ఇదిలా ఉండగా, బింట్ జెబెయిల్ అనే దక్షిణ పట్టణంలో హెజ్‌బొల్లా డిప్యూటీ కమాండర్ నస్సీర్ రషీద్‌ను శనివారం హతమార్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. బీరుట్‌లో ఉత్తర ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న వాహనంపై ఇజ్రాయెల్ వాయుసేన దాడిలో ఇద్దరు మృతి చెందారని లెబనాన్‌లో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News