Saturday, April 20, 2024

రబ్బర్‌ఉడ్ పెట్టుబడులపై థాయ్‌తో ఒప్పందం

- Advertisement -
- Advertisement -

investments

 

హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉండడం వల్లే దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని అన్నారు. దీంతో దేశ వృద్ధిరేటును మించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.

శనివారం మాదాపూర్‌లో ఇండియా- థాయ్‌లాండ్ మ్యాచింగ్ అండ్ నెట్‌వర్కింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. థాయ్‌లాండ్ పక్షాన థాయ్ ఉప ప్రధాని జరీన్ లక్సనావిసిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, థాయ్‌లాండ్‌తో భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలున్నాయన్నారు. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని అన్నారు. తెలంగాణలో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేయాలని థాయ్‌లాండ్ ఉప ముఖ్యమంత్రిని కోరారు. బ్యాంకాక్-హైదరాబాద్ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని థాయ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా రబ్బర్‌వుడ్ పరిశ్రమలో థాయ్‌లాండ్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఒయు) చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

థాయ్‌లాండ్ ఉప ప్రధాని భారత్ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. తెలంగాణలో ఫుడ్ ప్రసెసింగ్‌కు సరిపడా నీటి వనరులు ఉన్నాయన్నారు. ఫర్నీచర్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్న థాయ్‌లాండ్‌ను తెలంగాణలోనూ నూతన ఆవిష్కరణలు పరిచయం చేయాలని సూచించారు. రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల రవాణా కోసం 400 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపారు. బ్యాంకాక్-హైదరాబాద్ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రొత్సహించాలని అన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు కల్పిస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలతో చాలా సులభంగానే పరిశ్రమలు పెట్టవచ్చన్న భావనతోనే ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీలు తమ శాఖలను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేస్తున్నాయని అన్నారు. అనంతరం ధాయ్‌లాండ్ ఉప ముఖ్యమంత్రిని కెటిఆర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ చిహ్నాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ బహుకరించారు.

Telangana as an investments state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News