Tuesday, September 17, 2024

నేటి నుంచి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటుగా శా సనమండలి సభ్యులతో కలిపి ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసం గం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ (బిఎసి) సమావేశం జరుగుతుందని అసెంబ్లీ అధికారవర్గాలు తెలిపా యి. ఈ బిఎసి సమావేశంలో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు జరుపుకోవాలనే అంశంపై చర్చించి తు ది నిర్ణయం తీసుకొంటారు. అసెంబ్లీ, శాసనమండలిలో రోజుకు ప ది ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి మంత్రులు సమాధానాలు ఇస్తారు. ఈనెల 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.

ఈ కేబినేట్ భేటీలో 2023-24వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పైన చర్చ జరగనుంది. ఈనెల 6వ తేదీన రాష్ట్ర ఆర్థ్ధికశాఖ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అధికారవర్గాల సమాచారం. రాష్ట్ర గవర్నర్ తమిళిసై తన ప్రసంగం లో అభివృద్ధి, సంక్షేమ రం గాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల ను ఉభయ సభల సభ్యుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు వివరించనున్నా రు. అంతేగాక గవర్నర్ తన ప్రభుత్వం సాధించిన ఘనతను, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 2023-24వ ఆర్థ్ధిక సంవత్సరానికి మంత్రి హరీష్‌రావు ఓట్- ఆన్- అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ఆ అధికారులు వివరించారు. ఈ బడ్జెట్‌ను డిసెంబర్ నెలాఖరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆన్‌గోయింగ్ పథకాలకు అవసరమైన నిధులు, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు అవసరమైన నిధులతో కలిపి ఓట్- ఆన్- అకౌం ట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.

సాధారణంగా కేంద్ర ప్రభు త్వం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తమతమ రాష్ట్రాలకు ఏమై నా కేటాయింపులు వచ్చాయా?, పథకాలు, కొత్తకొత్త కేంద్ర సంస్థలు మం జూరయ్యాయా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రాలు తమతమ బడ్జెట్‌లకు రూపకల్పన చేసుకొంటాయి. అయితే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయిని కూడా అదనంగా ఇవ్వలేదని, కేవలం పన్నుల ఆదాయంలో చట్టపరంగా వచ్చే వాటా నిధులు తప్ప ఇంకేమీ మన రాష్ట్రానికి వ చ్చే అవకాశాలు లేవని, అందుచేతనే రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంపైనే ఆధారపడి బడ్జెట్‌ను రూపకల్పన చేసుకొంటున్నామని కొందరు అధికారు లు వివరించారు. కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనే అంశాలు కూడా ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా చర్చకు వస్తాయని, కేంద్రం చేసిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార బిఆర్‌ఎస్‌పార్టీతో సహా మిత్రపక్షమైన ఎఐఎంఐఎం, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ముప్పేట దాడి చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకొన్నట్లుగా ఆయా రాజకీయ పార్టీల కార్యాలయా ల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఆర్థి కంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయాలు చేయడమే కాకుండా విద్యాసంస్థలను నెలకొల్పడంలోనూ, నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయహోదా కూడా ఇవ్వకుండా మొండికేసిన కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తూర్పారబట్టేందుకు, అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కించేందుకు బిజెపి మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ మాటల దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి తగిన సమాచారాన్ని తెప్పించుకొన్న బిఆర్‌ఎస్ పార్టీల నాయకులు కేంద్రంపై ధ్వజమెత్తేందుకు సమాయత్తమయ్యారు. మొత్తంమీద ఈ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News