Sunday, April 28, 2024

ప్రభుత్వ వైఫల్యాలపై టిజెఎస్ తెలంగాణ బచావో యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్లృతం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తెలంగాణ జనసమితి (టిజెఎస్) తెలంగాణ బచావో పేరుతో పాదయాత్రకు పూనుకున్నది. ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాం తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బచావో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హన్మకొండ జిల్లాలో జయ శంకర్ సార్ స్వగ్రామం అక్కoపెట నుండి ఈ పాదయాత్ర గురువారం ప్రారంభమయ్యింది. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి కోదండరామ్ ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను మరచిందని ఈ సందర్భంగా కోదండరామ్ అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి పాదయాత్ర చేపట్టామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 80000 వేల మంది కార్మికులు పని చేస్తున్నా సింగరేణిని 60000 వేల మంది కార్మికుల వరకు తెచ్చారని ఆరోపించారు డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు అక్కడి నుండి యాత్ర ములుగు జిల్లాలోకి ప్రవేశించింది అక్కడ తాడ్వాయి మండలoలో గల పడిగేపురం గ్రామానికి చేరుకుని పోడు రైతులకు భరోసా ఇచ్చారు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసేదాక మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలకు సంపూర్ణ హక్కులు ఉంటాయని తెలిపారు. అనంతరం మేడారనికి చేరుకుని సమ్మక్క సారక్క లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడ తెలంగాణ బచాగో రెండు రోజుల పాటు నిర్వహించిన యాత్ర ముగించారు కోదండరామ్‌తో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జూన్,బైరీ రమేష్, గోపగాని శంకర్ రావు, ఆశప్ప, రాష్ట్ర నాయకులు పల్లె వినయ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డోలి సత్యనారాయణ, లక్ష్మ రెడ్డి మారం, హన్మమంతు రెడ్డి, టిజెఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్, రైతు విభాగం అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి ,యాత్ర ఇన్చార్జ్ మానుకోట నాయకులు పిల్లి సుధాకర్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కిరణ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, వర్దన్న పెట్ నియోజకవర్గ నాయకులు విజయ్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు జావేద్, ప్రధాన కార్యదర్శి రాజేశ్,నాయకులు రవీందర్, రామ్ చందర్,ఖమ్మం, భద్రద్రి కొత్త గూడెం జిల్లాల నాయకులు మల్లెల రామనాదం,నాబిషేక్, నునావత్ రవీందర్, కరుణాకర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, రంగారెడ్డి జిల్లా నాయకులు రంగారెడ్డి, కొత్త రవి,కార్తీక్ రెడ్డి, మహిళా జన సమితి నాయకులు పుష్ప, లక్ష్మి, విజెఎస్ నాయకులు మనోజ్, రవి, నరహరి,బసంత్,తరుణ్, వినయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News