Friday, May 3, 2024

పెద్దల ఇళ్లలా పేదల ఇళ్లు

- Advertisement -
- Advertisement -

Telangana Double Bedroom Housing scheme

 

సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లు
హైదరాబాద్‌లో పంపిణీకి సిద్ధమవుతున్న 85,000 గృహాలు
రూ.9,500కోట్ల వ్యయంతో నిర్మాణాలు
పార్కులు, చక్కని పాత్‌వేలు, విద్యుత్ దీపాల వెలుతురులో జిగేల్‌మంటున్న ప్రాంగణాలు
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ హర్షం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు సింగపూర్‌ను తలపిస్తున్నాయి. ప్రైవేటు అపార్టుమెంట్లు, విల్లాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. సర్వాంగ సుందరంగా నిర్మితం అవుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న ప్రాంగణాల చూట్టు చూడచక్కటి మొక్కలను పెంచుతున్నారు. మనస్సును హత్తుకునే రీతిలోలో ల్యాండ్‌స్కేపులు, చిన్న, చిన్న పార్కులు, వాటిల్లో కనువిందు చేసే విధంగా పూల మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. క్రమపద్దతిలో ఇళ్ల నిర్మాణం, చక్కటి పాత్‌వేలు, రంగురంగుల విద్యుత్ దీపాలను నెలకొల్పుతోంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యునిటి తరహాలో అన్ని సౌకర్యాలను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.

కాగా గ్రేటర్ పరిధిలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణాలు కళ్లను కట్టిపారేస్తున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. కళ్లు జిగేల్‌మనిపించే రీతిలో అన్ని రకాల సౌకర్యాలతో సర్వంగా సుందరంగా నిర్మితం అవుతున్నాయని ఆయన ట్విట్టర్ వేదికగా కొన్ని ఫోటోలను పోస్టు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో సరికొత్త బెన్‌మార్క్‌ను సెట్ చేస్తుందని వ్యాఖ్యానించారు. సమాజంలో పేదలు గౌవరంగాప్రదంగా బ్రతకడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పునాదిగా ఉపయోగపడనున్నాయని ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. డిసెంబర్‌లో లబ్ధిదారులకు 85వేల ఇళ్లను అందించబోతున్నామన్నారు. ఈ పండుగ కోసం తాను కూడా ఎంతో ఉత్సాహంగా నిరీక్షిస్తున్నానని తెలిపారు.

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ప్రధాన లక్షంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వాల మాదిరిగా పేదలకు పిచ్చిక గూళ్ల మాదిరిగా కాకుండా నేటి అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తోంది. ఇళ్ల నిర్మాణాల నాణ్యతలోనూ ఎక్కడా రాజీపడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. పేదల సొంతింటి కళను నిజం చేసే విధంగా ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు రూ. 9,700 కోట్లతో ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

రానున్న డిసెంబర్ నాటికి 85వేల ఇళ్లను పంపిణి చేయాలన్న లక్షంతో ప్రభుత్వం ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. కాగా త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖారారు చేసే పనుల్లో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. సాధ్యమైనంత త్వరగా దీనిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం డిసెంబర్‌లో పెద్దఎత్తున లబ్ధిదారులకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను పంపిణి చేయనున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సుమారు 4వేల చొప్పున ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తారు.

Telangana Double Bedroom Housing scheme

Telangana Double Bedroom Housing scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News