Sunday, April 28, 2024

నెరవేరనున్న పేదోళ్ల సొంతింటి కల

- Advertisement -
- Advertisement -

Telangana Double Bedroom Housing Scheme

ఉన్నత ప్రమాణాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం

హైదరాబాద్ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తోంది. ఇళ్లు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. పగలు పనికి పోయినా రాత్రి మనది అనే ఓ చిన్న గూడు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలకు కోటి వెలుగులు పంచుతూ.. 560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్ తో పాటు రెండు బాత్ రూమ్‌లతో , డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో తొలివిడతగా రూ.19 వేల 329 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి తో సహ 2 లక్షల 91 వేల 57 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కృషిని జాతీయ స్ధాయి నాయకులు పార్లమెంటు సాక్షిగా ప్రశంసించారు. రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు 2,91,057 గృహములను మంజూరు చేశారు. చాలా వరకు వీటి నిర్మాణాలు పూర్తి చేశారు. కొన్ని చోట్ల లబ్దిదారులకు అందజేశారు. వీటిపై ఇప్పటి వరకు రూ.10,806.728 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

బిల్లుల విడుదలలో పారదర్శకత, జవాబుదారితనం
గుత్తేదార్లు బిల్లులు సమర్పించిన 15 పనిదినాలలో జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా బిల్లుల చెల్లింపులో జవాబుదారితనం, పారదర్శకత కోసం ఆన్‌లైన్ ప్రాజెక్టు పర్యవేక్షణ వ్యవస్థ( ఒపిఎంఎస్)ను ప్రవేశ పెట్టారు. దీంతో గుత్తేదార్ల బిల్లు వివరములు ఆన్‌లైన్‌లో సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరులకు బిల్ రికార్డు, జరిగిన పనిని పరిశీలించి ఎంబిలు పంపవలసిందిగా ఎస్‌ఎంఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తారు. ఈఈ పంపబడిన బిల్లులను జిల్లా నోడల్ అధికారి పరిశీలించిన వెంటనే జిల్లా కలెక్టర్ల ద్వారా గుత్తేదార్ల బ్యాంక్ అక్కౌంట్ లో నేరుగా నగదు జమ చేయబడుతుంది.ఈ ప్రక్రియ మొత్తం పదిహేను రోజులలో పూర్తి అవుతుంది. జిల్లా కలెక్టర్ల నుంచి నిధుల విడుదల కోసం వచ్చిన ప్రతిపాదనలు వెంటనే పరిశీలించి రాష్ట్ర స్థాయిలో నిధుల విడుదల వెంటనే సంబంధిత కలెక్టర్ల బ్యాంకు అకౌంట్స్‌కు జమ చేయడం జరుగుతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ డిజైన్, లే-ఔట్లలో, సృజనాత్మకత, ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకే పారదర్శకత పాటించడంతో ఈ విధానానికి జాతీయ స్థాయిలో ఇటీవల అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. డబుల్ బెడ్‌రూమ్ పథకం అమలును అధ్యయన చేసేందుకు రాష్ట్రాన్ని సందర్శించిన జాతీయ స్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు, నిపుణులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి, ప్రశంసిస్తూ వారి రాష్ట్రాలలో కూడా అమలు పరుచుటకు వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News