Thursday, May 2, 2024

తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ జిల్లాః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్య దినోత్సవ ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.

జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ కిట్స్, న్యూట్రిషియన్ కిట్స్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు, వైద్య, నర్సింగ్ కళాశాలల విద్యార్ధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సభలను ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య సేవలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, విజయాలను వివరించాలని అన్నారు. జిల్లాలో వైద్య కళాశాలలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు, న్యూట్రిషియన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, ఎంసీహెచ్‌లు, మతా శిశు సంరక్షణ సేవలు, పెరిగిన మౌలిక వసతులు వంటి వాటిపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్‌కు కలెక్టర్ సూచించారు.

వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలన్నారు. ఉత్తమ సేవలందించిన ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, స్టాప్ నర్సు, ల్యాబ్ టెక్నిషియన్, వైద్యులను ఎంపిక చేసి సత్కించి అవార్డులు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మేడ్చల్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని మేడ్చల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని శ్రీగార్డెన్స్‌లో ఉదయం 9 గంటలకు జరుగు నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని డా.పుట్ల శ్రీనివాస్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News