Thursday, May 2, 2024

కెసిఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ లాంటి నాయకుడు ఉండాలని, ఢిల్లీ నేతల మాటలు నమ్మితే మాటిమాటికీ ఢిల్లీ వెళ్లాల్సిందేనని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇప్పడు జరుగుతున్నది తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగిరికి మధ్య పోటీ అని ఆయన అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజక వర్గం నుంచి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ఉప్పల వెంకటేశ్ తన రాజకీయ జీవితం ఏంటని అడిగారు. ఆయన 18 ఏళ్లకే సర్పంచ్ అయినట్టు చెప్పాడు. పేద విద్యార్ధులకు చదువు చెప్పిస్తున్నాడు. ఖచ్చితంగా బిఆర్‌ఎస్ పార్టీ ఆయనకు అండగా వుంటుందని అన్నారు. ఆయనకు పెద్దపదవి ఇచ్చి గౌరవిస్తామని అన్నారు.

రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షే పధకాలు ఇస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్దుల వరకు అందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. కెసిఆర్ కిట్స్, చదువులకు ఆర్ధిక సాయం, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సొంత భూమి ఉన్న వారికి గృహలక్ష్మిపధకం, ఉద్యోగాలు, రైతుబంధు, చేనేత మిత్ర, గొర్రెల పంపిణీ వంటి పధకాలు అందిస్తున్నామన్నారు. 76 ఏళ్ల స్వాతంత్య్రంలో గత ప్రభుత్వాలు ఇంటింటికీ నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రతి పక్షాలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నాయి. 4వేల పెన్షన్, 25 గంటల కరెంట్ ఇస్తామంటున్నారు. ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఒక్కచాన్స్ అని ఒకాయన అడుక్కుంటున్నాడు.

బిజెపి అధికారంలోకి వస్తే కెసిఆర్ పధకాలు కొనసాగిస్తాం అంటున్నారు. కెసిఆర్ పథకాలు కొనసాగించాక మీరెందుకు పీకడానికి అంటూ ఎద్దేవా చేశారు. సంపద పెంచాలి, పేదలకు పంచాలన్నదే బిఆర్‌ఎస్ నినాదమని అన్నారు. కానీ సంపద పెంచుకుని వెనకేసు కోవాలన్నదే ప్రతి పక్షాల తీరుగా వుందన్నారు. సంచులు మోసేవాడు కూడా నీతులు పలుకుతున్నాడు. సంచులు మోసి జైళ్లలో చిప్పకూడాఉ తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. పిసిసి పదవి అదొక పదవా? ప్రైమినిస్టర్ పదవిలా బిల్డప్ ఇస్తున్నాడు. కాంగ్రెస్‌కు అభ్యర్ధులే లేరు. వీళ్లకు ఓటు ఎలా వేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం కష్టపడే వాళ్లం. వీళ్లను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని విమర్శించారు.

ఇక బిజెపి అధికారంలోకి రాగానే అందరి ఖాతాల్లో 15లక్షలు వేస్తామన్న మోడీ మరి దానిని అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కెసిఆర్‌ను జైలుకు పంపుతామన్నవాడే షెడ్డుకు పోయాడని గుర్తు చేశారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి మద్దతుగా ఉండి గెలిపించుకోవాలని కెటిఆర్ సూచించారు. మహబూబ్ నగర్‌లో 14 స్థానాలు బిఆర్‌ఎస్ గెలవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News