Thursday, May 2, 2024

తెలంగాణ విద్యుత్ సరఫరా దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటాయని చెప్పిన నాయకులంతా నేడు చిమ్మ చీకట్లో ఉన్నారని మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోమవారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో తెలంగాణ విద్యుత్ విజయోత్సవం సంబరాలను ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్‌తో కలిసి మాట్లాడుతూ కరెంట్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్1గా నిలిచిందని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 150.51కోట్ల రుపాయలతో విద్యుత్ సరఫరాను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ పూర్తి ఉచితంగా అధింస్తున్నామన్నారు. విద్యుత్ రంగాన్నీ బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.39.321కోట్ల ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుండి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందన్నారు. విద్యుత్ రంగంలో అద్భుత నీతిలో పురోగతి సాధించి దేశానికే దారి చూపే టార్చ్‌బేరర్‌గా నిలిచిందని పేర్కోన్నారు. స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతందన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌పి రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డి, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, కంది ఎంపిపి సరళ పుల్లారెడ్డి, జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, కొండాపూర్ ఎంపిపి మనోజ్‌రెడ్డి, మాజి జడ్‌పిటిసి మనోహర్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, విద్యుత్ శాఖ అధికారులు సురేందర్ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రమేశ్వర్‌స్వామి, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్‌స్వామి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News