Friday, May 3, 2024

సమస్యలు… ‘సశేషం’

- Advertisement -
- Advertisement -

తేలని విభజన వివాదాలు

ఒక్క అంశాన్నీ పరిష్కరించని కేంద్రం

స్పష్టమైన ఆదేశాలివ్వలేకపోయిన అజయ్‌భల్లా
విభజన చట్ట సవరణను వ్యతిరేకించిన తెలంగాణ
సింగరేణి జోలికొస్తే ఊరుకోం…
సింగరేణిపై ఎపికి ఎలాంటి హక్కుల్లేవు
9షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలు ఇప్పట్లో లేనట్లే
ఎస్‌ఎఫ్‌సి ఆస్తులపై కోర్టు కేసుల పరిశీలన
10వ షెడ్యూలు సంస్థలపై పీటముడి
పౌర సరఫరాలశాఖ సబ్సిడీల్లో తెలంగాణ వాటా తేల్చాలి
చట్టంలో లేని 12 సంస్థలపై తెలంగాణ అభ్యంతరం
వివాదాలపై యధాతథ స్థితి కొనసాగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమావేశం లో పాల్గొన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ నేతృత్వంలోని తొమ్మిది మంది అధికారుల బృందం 11 రకాల ప్రధాన అంశాలను పరిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరింది. కానీ ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఎపి చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ నేతృత్వంలోని అధికారుల బృందం కూడా తొమ్మిది అంశాలకు పరిష్కారం చూపండని కోరింది. వాటికి కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లా ఎలాంటి జవాబులు ఇవ్వలేకపోయారని తెలిసింది.

మన తెలంగాణ / హైదరాబాద్ : “తాంబూలాలు ఇచ్చాం… తన్నుకు చావండి…” అన్నట్లుగా ఉంది కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. రాష్ట్ర విభజన జరిగి ఏకంగా ఎనిమిదేళ్ళ కాలం ముగిసిన తర్వాతకూడా ‘చూస్తాం. చేస్తాం…పరిశీలిస్తు న్నాం’…అనే మాటలతోనే పబ్బం గడుపుతూ కాలయాపన చేయడానికే కేంద్ర ప్రభుత్వం అధిక ప్రా ధాన్యతను ఇస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా అధ్యక్షతన జరిగిన స మావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉ న్నతాధికారుల బృందాలు భేటీ అయ్యా యి. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన ఏ ఒక్క సమస్యనుగానీ, ఏ ఒక్క వివాదాన్ని కూడా కేంద్ర హోంశాఖ పరిష్కరించలేకపోయిందని సమావేశంలో పాల్గొన్న కొందరు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ నేతృత్వంలోని తొమ్మిది మంది అధికారుల బృందం 11 రకాల ప్రధాన అంశాలను పరిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ అధికారుల బృందం కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరింది.

కానీ ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నుంచి చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ నేతృత్వంలోని అధికారుల బృందం కూడా తొమ్మిది అంశాలపై పరిష్కారం చూపండని కో రిందని, వాటికి కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లా ఎ లాంటి జవాబులు ఇవ్వలేకపోయారని తెలిసింది. ఇ లా రెండు తెలుగు రాష్ట్రా ల ఉన్నతాధికారుల్లో ఏ ఒ క్కరికి కూడా ఎలాంటి ప్ర యోజనం జరగలేదని ఇరు రాష్ట్రాల అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వండని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గట్టిగా ఎపి ప్రభుత్వా న్ని ఆదేశించలేక పోయారని అధికారులు మండిపడుతున్నారు. ఎపి ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆస్తుల పంపకాలు, సంస్థల విభజన వంటి అంశాలతో సాక్షాధారాలతో సహా నివేదించినప్పటికీ కేంద్ర హోంశాఖ పెడచెవిన పెట్టిందని, విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం ఏదో మొక్కుబడిగా సమావేశాలను నిర్వహించినట్లుగా ఉందని, అంతేగాక కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనలో నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించినట్లుగా చెప్పుకునేందుకే కేంద్ర హోంశాఖ వ్యవహారశైలి ఉందని ధ్వజమెత్తారు.

ముఖ్యంగా 9వ షెడ్యూలులోని 91 సంస్థల విభజన విషయంలో డాక్టర్ షీలాభిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను కూడా అమలు చేయించడంలో కేంద్రం విఫమైందని, వివాదాల పరిష్కారానికి నియమించిన సబ్-కమిటీ మూడు దశల్లో ఈ సంస్థలను విభజించాలని సిఫారసు చేసిందని, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలున్నాయని అధికారులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎపి ప్రభుత్వం మాత్రం షీలాభిడే సిఫారసులను యధావిధిగా ఆమోదించిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలన్నీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఆ కేసులు తేలాల్సి ఉందని వివరించారు. అంతేగాక డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డిఐఎల్‌ఎల్-దిల్), ఎపి డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ఇచ్చిన విన్నపాలను కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపించారు. అదే విధంగా ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వివాదం విషయాన్ని కూడా పరిశీలించాలని హోంశాఖాధికారులను అజయ్‌భల్లా ఆదేశించారు.

10వ షెడ్యూలులోని 142 ఇన్‌స్టిట్యూషన్ల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదని, తెలుగు అకాడము విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించేవిగా ఉన్నాయని, అందుకే తీవ్రంగా వ్యతిరేకించామని అధికారులు తెలిపారు. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) , ఎపి హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్‌ఎంఇఎల్)లు పూర్తిగా తెలంగాణకు చెందిన ఆస్తులని, ఇందులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఎపిహెచ్‌ఎంఇఎల్ సంస్థ కేవలం సింగరేణికి అనుబంధ సంస్థ మాత్రమేనని, అందుకే సింగరేణిలో వాటాలు కోరుతున్న ఏపీ ప్రయత్నాలను తెలంగాణ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారని, దానిపై పరిశీలిన జరపాలని అజయ్ భల్లా హోంశాఖాధికారులను ఆదేశించారు. సివిల్ సప్లయీస్ కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిన నిధుల్లో వివాదాస్పదమైన 354 కోట్ల రూపాయల నిధుల విషయంలో సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర వాటా తేలే వరకూ ఆ నిధులను విడుదల చేసేదిలేదని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం తెగేసి చెప్పింది.

విభజన చట్టంలో లేనటువంటి 12 ఇన్‌స్టిట్యూట్‌లను విభజించడానికి ఎపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయశాఖ సలహా తీసుకోనున్నట్లుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌లపైన కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాలు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంగీకారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయించాలని అధికారులు కోరగా నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థ్ధికశాఖాధికారులను అజయ్ భల్లా ఆదేశించారని తెలిపారు. కానీ ఈ ఆదేశాలు ఆశాజనంగా లేవని కొందరు అధికారులు పెదవి విరిచారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉన్న అంశాన్ని గుర్తు చేయగా ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖాధికారులను పరిశీలించాలని అజయ్ భల్లా కోరారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్న అంశాన్ని గుర్తు చేయగా ఈ అంశాన్ని కూడా పరిశీలించాలని అజయ్ భల్లా రైల్వేశాఖాధికారులను కోరారు.

విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56లను సవరణలను చేయాలని ఎపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల విభజన జరిగిన ఎనిమిదేళ్ళ తర్వాత చట్టంలో సవరణలు చేయడం అర్ధరహితమని, ఇలా చేస్తే ఆ చట్టానికి హేతుబద్దత ఉండదని ఆ అధికారులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అధికారులు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారని, దానిపైన కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఏపీ అధికారులు తెలిపారు. ఎపిలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం సాధ్యంకాదని కేంద్ర రైల్వేబోర్డు తేల్చి చెప్పిందని వివరించారు. అమరావతి నిర్మాణానికి మరో వెయ్యి కోట్లు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా గతంలో ఇచ్చిన 1500 కోట్ల రూపాయల నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కోరారు.

శివరామకృష్ణన్ కమిటీ అమరావతి నిర్మాణానికి 29 వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని సిఫారసు చేసిందని ఏపీ అధికారులు గుర్తు చేయగా అజయ్ భల్లా స్పందించలేదని ఆ అధికారులు వివరించారు. ఇలా రెండు గంటలపాటు సాగిన సమావేశంలో ఎపి లేవనెత్తిన ప్రతి అంశాన్నీ తెలంగాణ అధికారులు వ్యతిరేకించడమే కాకుండా అన్ని వివాదాస్పద అంశాల్లో యధాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. అందుకు చేసేదేమీలేక కేంద్ర హోంశాఖాధికారులు అంగీకరించినట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News