Friday, September 19, 2025

సౌదీలో తెలంగాణ యువకుడు నరకయాతన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ యువకుడు ఉపాధి కోసం సౌదీ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నాడు. నిజామాబాద్ జిలా జానకంపేట వాసి ఆల్తాఫ్ 2016లో సౌదీకి వెళ్లాడు. రెండు నెలల పాటు సౌదీలోని ఓ కంపెనీలో పని చేశాడు. ఉద్యోగం వేరే చోట అంటూ ఆల్తాఫ్‌ను మరో వ్యక్తి తీసుకెళ్లాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఒంటెలు, గొర్రెలు మేపాలని సూచించాడు. జీతం ఇవ్వకపోవడంతో ఆల్తాఫ్ మోసపోయానని గ్రహించాడు. తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యంగా కనిపించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. దేశానికి దేశంలో ఎవరికి చెప్పుకునే పరిస్థితులు లేకపోవడంతో ఒంటరిగా కుమిలిపోతున్నాడు. తెలంగాణ ప్రభుత్వమే తనన ఆదుకోవాలని కోరుతున్నాడు.

Also Read:  పరస్త్రీ మోజులో ఆర్మీ అధికారి..కోర్టు మార్షల్ శిక్ష ఖరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News