Thursday, May 2, 2024

టెస్టు ఫార్మాట్ చాలా క్లిష్టమైంది: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇతర ఫార్మాట్‌లతో పోల్చితే సంప్రదాయ టెస్టు క్రికెట్ చాలా క్లిష్టమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మట్‌లో ఆడటం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు ఆడానని, అయితే టెస్టుల్లో ఆడేందుకు ప్రతిసారి తాను ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశాడు.

టి20 క్రికెట్ వచ్చిన తర్వాత చాలా మంది క్రికెటర్లు టెస్టు ఫార్మాట్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నాడు. అంతేగాక ఐసిసి కూడా టెస్టులకంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నాడు. ఇలాంటి స్థితిలో టెస్టు క్రికెట్‌లో రాణించడం ప్రతి క్రికెటర్‌కు సవాల్‌గా మారుతుందన్నాడు. సుదీర్ఘ కాలం పాటు క్రీజులో నిలవడం చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. ఇక ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై టెస్టు సిరీస్ గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News