Sunday, September 15, 2024

గుడ్ న్యూస్.. దోస్త్ అడ్మీషన్ల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దోస్త్ షెడ్యుల్‌ ను ప్రభుత్వం పొడిగించింది. ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని డిగ్రీలో ప్రవేశాల కోసం సవరించిన అడ్మీషన్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. దోస్త్ కన్వీనర్, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ దేవసేన, ప్రత్యేక దశ రిజిస్ట్రేషన్లు, వెబ్-ఆప్షన్ల చివరి తేదీని పొడిగించి సవరించిన అడ్మిషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

దోస్త్ పత్యేక దశ సవరించిన ప్రవేశ షెడ్యూల్ ప్రకారం రూ.400 ఫీజు చెల్లించడం ద్వారా స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 2 నుండి 5వ తేదీ వరకు, వెబ్ ఆప్షన్లు ఆగస్టు 3 నుంచి 5 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 7న స్పెషల్ ఫేస్ సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. సీట్లు కేటాయించబడ్డ విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈ నెల 8, 9 తేదీల్లో (కాలేజీ ఫీజు/సీట్ రి జర్వేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా) రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News