- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కొత్తగా మరో ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. సి.చంద్రకాంత్ రెడ్డి, ఐపిఎస్ అధికారి విశ్వప్రసాద్, ప్రొఫెసర్ ఎల్.బి లక్ష్మీకాంత్ రాథోడ్‌లను టిజిపిఎస్‌సి నూతన సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరేళ్ల పాటు లేదా 62 సంవత్సరాల వయస్సు వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలిపారు. వీరి నియామకం వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమలులోకి రానుంది.
- Advertisement -