Sunday, December 15, 2024

‘తండేల్’ నుంచి తొలి సాంగ్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీ మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ జర్నీ ప్రారంభం కానుంది. తండేల్ ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి…ఈనెల 21న రిలీజ్ కానుంది.

సాంగ్ పోస్టర్‌లో లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ప్రేమ, ఆప్యాయతను అందంగా చూపించారు. నాగచైతన్య గడ్డంతో రగ్గడ్ చార్మ్‌గా కనిపించగా, సాయి పల్లవి హాఫ్ శారీలో అందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News