Tuesday, May 14, 2024

జాతీయస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: స్వచ్ఛ సర్వేక్షన్‌లో కరీంనగర్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు అభివృద్ధి పనులపై ప్రత్యేకాధికారులతో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జూలై 15 నుండి వెరిఫికేషన్ బృందాలు పర్యటించనున్నాయని, జూలై 15 తరువాత జిల్లాలో, ఆగస్టు 1 తరువాత నుండి నామినెటెడ్ గ్రామ పంచాయతీలలో పనులను పర్యవేక్షించి మార్కులు వేయునున్నారని తెలిపారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నిర్దేశించిన ప్రకారం మొక్కలను నాటే కార్యక్రమం సజావుగా జరగాలన్నారు. జిల్లాలో లక్షం మేర ఆయిల్ ఫామ్ సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్లాంట్ మెటీరియల్, డీడీ కలెక్షన్ పూర్తి చేయాలన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీ పక్కా పంచాయతీ భవనాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైకుంఠధామాలు, సెగిరికేషన్ షెడ్లు, డంపింగ్ యార్డ్, పట్టణాల్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News