Thursday, May 2, 2024

ప్రజావాణికి వెల్లువెత్తుతున్న ప్రజాదరణ

- Advertisement -
- Advertisement -

ప్రజా భవన్ నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు క్యూలైన్లు
దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
అటు ట్రాఫిక్ నియంత్రణ
ఇటు ప్రజావాణికి క్రమపద్ధతిలో క్యూలైన్ ద్వారా లోపలికి పంపడం
పోలీసులకు టఫ్ టాస్క్‌గా మారిన వైనం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజావాణికి జనం పోటెత్తారు. ప్రతి మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయిం చడంతో ప్రజావాణిలో ప్రజల నుంచి వినతుల్ని మంత్రులు స్వీకరిస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరించి, సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శుక్రవారం ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రజలు తరలివచ్చారు. ఉదయం 5 గంటలకే పెద్దసంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో నిలబడ్డారు. ఈ క్యూలైన్ 9 గంటల కల్లా రెండు కిలోమీటర్లకు పెరిగిపోయింది. దీంతో బేగంపేట నుంచి పంజాగుట్ట సిగ్నల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. బేగంపేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ప్రజావాణికి వచ్చిన వారిని క్రమపద్ధతిలో నిల్చొబెట్టి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కొంత టఫ్ టాస్క్‌గా మారింది. కాగా, కొందరు రాత్రి నుంచే ప్రజావాణిలో తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించేం దుకు వచ్చిన వారున్నారు. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఎం రేవంత్ ప్రకటించారు. సిఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రజావాణిగా మార్చా రు. ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలతో బేగంపేట శుక్రవారం రద్దీగా మారింది. మరోవైపు సిఎం క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సిఎం అధికారిక నివాసంగా మార్చిన నేపథ్యంలో ప్రజావాణిలో ఆయన ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కొంత సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను శాఖల వారీగా పంపుతున్నారు. దీంతో.. సిఎం స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో రాష్ట్రం నలు మూలల నుంచి ప్రజలు వేలాదిగా ప్రజా భవన్‌కు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో బేగంపేట ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్న ఇనుప కంచెలను తొలగించారు. క్యూలైన్లలో ప్రజలు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం పది గంటల్లోపు వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరి స్తామని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్ ప్రజా భవన్‌కే రానవసరం లేకుండా ఎంఎల్‌ఎలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాణి నిర్వహింపజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రజావాణి నియోజకవర్గాల్లోనే నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారమవడమే కాకుండా ప్రజలకు హైదరాబాద్ దాకా వచ్చే భారం తగ్గుతుంది. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్బా ర్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సిఎం రేవంత్‌రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరు మార్చారు. అప్పట్నించీ ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరి స్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖలు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News