Thursday, May 2, 2024

విమానాలలో వైరస్ వ్యాప్తి ఉండదు : సిడిసి

- Advertisement -
- Advertisement -

 

వాషింగ్టన్ : అత్యధిక వైరస్‌లు, ఇతర క్రిములు విమానాలలో తేలికగా వ్యాపించవని అమెరికా నిపుణులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసి) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సంస్థ కోవిడ్ 19పై మార్గదర్శకాలను వెలువరించింది. విమాన ప్రయాణాలలో భౌతిక దూరం పాటించాలనే విషయాన్ని ఇందులో పేర్కొనలేదు. విమానాలలో ప్రయాణికుల సీట్ల మధ్య దూరం, మధ్య సీట్ల ఖాళీ ఉంచాలనే వాదన విన్పిస్తోన్న దశలో సిడిసి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఇందులో ఎక్కడా విమానాలలో ప్రయాణికుల మధ్య దూరం గురించి ప్రస్తావించలేదు. అంతేకాకుండా విమానాలలో వైరస్ త్వరితగతిన వ్యాపించే అవకాశం లేదని కూడా తెలిపారు. అమెరికాతో పాటు పలు దేశాలలో వైరస్ కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపొయ్యాయి.

విమానయానం దాదాపుగా 90 శాతం వరకూ ఆగిపోయింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ దశలో ఇకపై భౌతికదూరం పాటించాలనే అంశం ప్రస్తావనకు వస్తోంది. అయితే ఇప్పటికే విపరీత నష్టాలలో ఉన్న విమాన సంస్థలు తక్కువ మంది ప్రయాణికులతో విమానాల నిర్వహణకు దిగడం మరింత చిక్కులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పైగా అత్యవసర ప్రాతిపదికన ప్రయాణికులను వారి వారి స్వదేశాలకు తరలించే క్రమంలో సీట్ల ఖాళీ ప్రధాన సమస్య అవుతోంది. దీనిపై న్యాయస్థానాలలో కేసులు సాగుతున్నాయి. అయితే వైరస్ వ్యాపిస్తుందనేది తప్పని, విమాన ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ విధిస్తే సరిపోతుందని సిడిసి తెలిపింది. విమానాలలో గాలి ప్రసరణం, వాయు పరిశుభ్రత వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే వైరస్ వ్యాప్తికి వీలే లేదని సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనా వైరస్ రిస్క్ రాకుండా ఉండేందుకు విమాన ప్రయాణాలే కాకుండా ఇతరత్రా ప్రయాణాలను కూడా మానుకుంటే మంచిదని అమెరికన్లకు ఈ సంస్థ సలహా ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News