- Advertisement -
అమెరికా లోని శాన్‌డియాగో సిటీకి సమీపంలో పసిఫిక్ మహా సముద్ర తీరం వద్ద శరణార్థుల బోటు మునిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో భారతీయ చిన్నారులు ఇద్దరు ఉన్నట్టు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని శాన్‌డియోగోకు 15 మైళ్ల దూరంలో 16 మందితో వెళ్తున్న బోటు బోల్తా పడింది. శాన్‌ఫ్రాన్సిస్కో లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దీనిపై స్పందించింది. ఈ ప్రమాదంలో భారతీయ కుటుంబం ఉన్నట్టు చెప్పారు. వీరిలో ఇద్దరు పిల్లలు గల్లంతయినట్టు గుర్తించారు. వారి తల్లిదండ్రులు ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. స్థానిక అధికారుల సాయంతో భారతీయ కుటుంబానికి సాయం అందిస్తున్నట్టు కాన్సులేట్ పేర్కొంది.
- Advertisement -