Saturday, April 27, 2024

పోలీసు వ్యానుపై కూర్చుని టిక్‌టాక్ చేసినందుకు..

- Advertisement -
- Advertisement -

Three TN youth

చెన్నై: పోలీసులపై టిక్‌టాక్ వీడియోలు చేసి చాలామంది యువకులు కోరి కష్టాలు కొనితెచ్చుకుంటుంటారు. కాని తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులకు మాత్రం దశ తిరిగింది. పోలీసు వ్యానుపై కూర్చుని టిక్‌టాక్ వీడియో తీసుకున్న ఇద్దరు యువకులకు పోలీసుల నుంచి స్నేహపూర్వక ఆదరణ లభించింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు బుధవారం రిపేరు కోసం వచ్చిన ఒక పోలీసు వ్యాను ముందు బ్యానెట్‌పై కూర్చుని సినిమా డైలాగులతో పాటు పాట పాడుతుండగా మరో యువకుడు దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వారంతా 17 ఏళ్ల యువకులు. ఈ విషయాన్ని గమనించిన వ్యాను డ్రైవర్ వెంటనే తన పైఅధికారులకు సమాచారం అందించాడు.

అయితే ఆ ముగ్గురు యువకులను పోలీసులు మందలిస్తారని భావించగా తూత్తుకుడి పట్టణ డిఎస్‌పి ఆర్ ప్రకాశ్ మాత్రం వారిని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. వారిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కాగా మరో యువకుడు ఆరవ తరగతి మాత్రమే చదివాడు. ఆ ఇద్దరు విద్యార్థులు పోలీసు శాఖలో చేరాలన్న తమ ఆకాంక్షను తెలియచేయడంతో వారు చదువుకుంటూనే వారాంతపు సెలవుల్లో ట్రాఫిక్ మెయింటేన్ చేసే బాధ్యతను డిఎస్‌పి అప్పగించారు. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అనే గ్రూపులో వారిద్దరిని కూడా చేర్చి సెలవు రోజుల్లో ట్రాఫిక్ సిబ్బందికి తోడ్పడవలసిందిగా ఆయన కోరారు. ఈ చర్య వల్ల వారిలో పోలీసుల పట్ల సానుకూల వైఖరి ఏర్పడుతుందని, వారిని మందలించడమో లేక శిక్షించడమో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డిఎస్‌పి చెప్పారు. పోలీసు కావాలన్న వారి కల కూడా నెరవేరగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Three TN youth made TikTok video on police van

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News