Sunday, April 28, 2024

బుధవారం రాశి ఫలాలు (06-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం –పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ.

వృషభం –వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మిథునం –ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు.

కర్కాటకం –ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

సింహం –చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. తగాదాలు, కోపతాపాలకు దూరంగా వుండండి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య –మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. స్వల్ప ధనలాభం.

తుల –ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభం.

వృశ్చికం –బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ధనలాభం.

ధనుస్సు –ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. సంతానం నాకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. గృహయోగం వుంటుంది.

మకరం –ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగులకు బదిలీలు వుంటాయి. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు.

కుంభం –కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ ఒత్తిడులు తొలుగుతాయి. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం –ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనయోగం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News