Wednesday, May 15, 2024

శనివారం రాశి ఫలాలు(14-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం;-  శ్రమకి తగిన ప్రతి ఫలం దక్కుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నూతన వస్తు, వస్త్రాలు  కొనుగోలు. ఆస్థి గొడవలకి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంటారు.

వృషభం :- సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకొంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.  వాహన యోగం గోచరిస్తున్నది. విలువైన వస్తు వస్త్రాభరణాల కొనుగోలుకై విరివిగా ధనం వెచ్చిస్తారు.

మిథునం :- నిరుద్యోగులకు శుభవార్తలు అందుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తనం వద్దు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

కర్కాటకం :- కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలుగుతాయి. స్వల్ప ధనలాభం. ఆహార విషయంలో మెలకువగా ఉండాలి.

సింహం :- పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు  పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విరివిగా వ్యాప్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు.

కన్య:- కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి-వ్యాపారాలు విస్తరింప చేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల:- ముఖ్యమైన కార్యక్రమాలలో సన్నిహితుల సాయం అందుకొంటారు. దూర ప్రయాణాలు అత్యవసరం అయితేనే చేయండి.  బంధువులతో ఎదురైన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. సాహసాల విషయాలలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం :- కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహన సౌఖ్యం ఉన్నది.

ధనుస్సు :- ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు  పొందుతారు. విద్యార్ధులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

మకరం:- ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దీర్ధకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వస్తు లాభం. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం:- వృతి-ఉద్యోగాల పరంగా, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు ఒక కొలిక్కి వస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

మీనం:- విద్య ఉద్యోగవకాశాలు పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News