Wednesday, May 15, 2024

శుక్రవారం రాశి ఫలాలు(22-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.వివాదాలకు తగాదాలకు దూరంగా వుండండి.

వృషభం – ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించు కొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.ఆకస్మిక ధన లాభం.

మిథునం – కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాల వలన లబ్ది పొందుతారు.

కర్కాటకం – కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

సింహం – పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్రా లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య – వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

తుల – రుణభారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంనకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం – వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు అనుకూలిస్తాయి.

ధనుస్సు – రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలుగుతాయి. సోదరుల నుండి కొంత సహాయం లభిస్తుంది.

మకరం – బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం – కార్య జయం కలుగుతుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. మానసిక ఆనందం కలిగి వుంటారు.

మీనం – వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది.దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News